తెలుగుని మనం చంపేస్తున్నామా?

ఇంతే సంగతులు   by  సోమేశ్వర్ 
Kannada King  Srikirshna Deva Rayalu who promoted and wrote a Telugu classic
ఈమధ్య నాకెవరో ఒక సందేశం పంపించారు. దానినేవాడి ఈ blog రాస్తున్నాను — వారికి ధన్యవాదాలతో.
“మళ్లీ కవిగానే పుడతా…. తెలుగు దేశంలో మాత్రం కాదు!!”…..
ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు….. ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని…. ఆయనే తనికెళ్ల భరణి….
ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు…. అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో…. ఆయన మాటల్లోనే…..
వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఆంధ్రులలో  ఉన్నంత మరెవరిలోనూ లేదు.  భరణి మాటల్లో:

“హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.

“గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే….. తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే….. ‘అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు… ఆయనేనా?’ అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.
“కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య…. వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి… పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.
తెలుగుకు ఆ శక్తి ఉంది….
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత “తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్” అని ఆవేదన వ్యక్తం చేశారట.
“తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది.” అన్నారట పీవీ.
“అవును… తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం”
ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే…. చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా…. అబ్బో అదో బ్రహ్మ విద్య.
ఓ సినిమాలో చెప్పినట్టు… దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి… షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం.

మారాలి…. మనం మారాలి. మన ఆలోచన మారాలి.  మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.
మా తెలుగు తల్లికి మల్లెెపూదండ…. మా కన్నతల్లికి మంగళారతులు..”
 ఈ మధురగీతాన్ని రాసినది ఒక తమిళ అయ్యంగార్ వంశీయుడయిన శంకరంబాడి సుందరాచార్య అనీ , “దేశ భాషలందు తెలుగు లెస్స”  అన్నది ఒక కన్నడ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలనీ చాలామందికి తెలియకపోవచ్చు.

తెలుగు మరిచి పోతున్న వారిలో ప్రవాసాంధ్రులు ఎక్కువ.  వారి కో్సం ఒకవత్రిక కానీ,
తెలుగుపత్రికల్లో ఒక శీర్షికకానీ ఎవరేనా మొదలెట్టగలరా?

First published on  Blogpot by Someswar
(written on Samsung tablet with many mistakes).
 

Published by

someswar1@gmail.com

Over 60 years of writing for a living and two books later, I still find the urge to write unstoppable, even as 80 has arrived. Hope to write even on the last day. Will UnstoppableAfterSeventy.Wordpress.com turn into SomeswarA80.WordPress.com ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.